ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : విద్యా శాఖలో పనిచేస్తున్న ఆమనగల్లు మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆమనగల్లు లోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో భోజన విరామ సమయంలో బతుకమ్మ ఆడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని.. హెల్త్ ఇన్సూరెన్స్ రూ.పదిలక్షల ఎక్స్ గ్రేషియా సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కోశాధికారి సాయికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పాడి నల్లని రిబ్బన్ లను ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ పద్మ జ్యోతి, సిఆర్పిలు షేక్. అహ్మద్, కిషన్, మల్లేష్, ఉద్యోగినీలు ధనలక్ష్మి ,శోభ, పరమేశ్వరి, చంద్రకళ రాధా బుజ్జి దేవి మహేశ్వరి చంద్రమణి లక్ష్మమ్మ, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.




