సమగ్ర కుల గణన

రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం
బలహీన వర్గాల నుండి రాజకీయాల్లోకి వొచ్చా..
కుల గణనపై పలు సార్లు రాహుల్‌ గాంధీ ప్రస్తావన
అసెంబ్లీలో సమగ్ర కుల, జన గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన
బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌
సభ ఏకగ్రీవ ఆమోదం…
సిఎం రేవంత్‌ను కలిసి మంత్రి పొన్నం ధన్యవాదాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : సమగ్ర కుల గణన తీర్మానాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక దినమని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభివర్ణించారు. కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, సహచర మంత్రులకు, వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్‌లకు, ఎమ్మెల్యేలకు మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డోర్‌ టూ డోర్‌ కుల గణనకి యావత్‌ కాంగ్రెస్‌ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండ టం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక శురకవారం కుల గణనపై అసెంబీల బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా  కుల గణన చేపట్టాలని,  జిత్నా హిస్సేదారి ఉత్నా భాగీదారి అని తమ నాయకుడు రాహుల్‌ గాంధీ పిలుపుకు అనుగుణంగా  రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టడం, ఆ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా శాసన సభలో ప్రవేశ పెట్టడంతో తన జీవితం ధన్యమైందని భావోద్వానికి లోనయ్యారు.. ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం డోర్‌ టూ డోర్‌ సమగ్ర  కుల గణన చేపట్టిందని, దీంతో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీకి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, ప్రియాంక గాంధీకి, ఏఐసిసి తెలంగాణ ఇంఛార్జి దిపాదాస్‌ మున్షీ లకి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

మనిషి జబ్బును తెలుసుకునేందుకు ఏ రకంగా నైతే ఎక్స్‌ రే ఉపయోగపడుతుందో సమగ్ర కుల గణన సైతం సమాజంలోని కులాల స్థితి గతులను తెలియజెప్పుతుందని కాంగ్రెస్‌ నాయకత్వం మొదటి నుండి చెప్తూ వొస్తుందని, డోర్‌ టూ డోర్‌ సమగ్ర కుల గణన కి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ చాటి చెప్తూనే ఉందని, మెమెంతో మాకంత దక్కుతుందని, అది కులగణన ద్వారా అమలవుతుందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన తరగతులు సామాజిక, విద్య , ఉద్యోగ ,రాజకీయాల్లో వెనుకబాటుకు గురవుతుండడం, అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ  సరైన న్యాయం జరగడం లేదని కాంగ్రెస్‌ పార్టీ భావించిందని,  దీంతో  దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల కుల గణన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించిందన్నారు. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన విధంగా డోర్‌ టూ డోర్‌ సమగ్ర కుల గణనకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కుల గణన  కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సూత్రం ప్రకారం సమాజంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుందనీలాయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా డోర్‌ టూ డోర్‌ కుల గణనను ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీకి, కుల గణన కి మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు, బీసీ నేతలు , మేధావి వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత్ఞతలు తెలుపుతుందని మంత్రి అన్నారు.

సిఎం రేవంత్‌ను కలిసి మంత్రి పొన్నం ధన్యవాదాలు
శాసనసభలో సమగ్ర కుల గణన తీర్మానం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంట బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకులా భరణం కృష్ణ మోహన్‌ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక సమగ్ర కుల గణన తీర్మానం ఆమోదం పొదండంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మేల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *