సబితారెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎంపిటిసి సురసాని రాజశేఖర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 23 : మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి సబితాఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సందర్బంగా బుధవారం  మండల ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,బిసి సెల్ మండల్ ప్రధాన కార్యదర్శి కాసోజు ప్రశాంత్ చారి,యూత్ నాయకుడు ఎగ్గిడి గణేష్ లు మంత్రి సబితారెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలపడం జరిగింది.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు పార్టీ నాయకులు,కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *