సబితమ్మకు మద్దతుగా నిలుస్తాం మహేశ్వరన్ని అగ్రగామిగా నిలుపుదాం 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03: మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితమ్మకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాం అని మండల పరిదిలో అకన్‌పల్లి గ్రామనికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు మంగళవారం అకన్‌పల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్, బి జె పి,బి ఆర్ ఎస్ నాయకులు మంత్రి సమక్షం లో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరినారు.ఈ సందర్బంగా బంగారు తెలంగాణ నిర్మాణం బిఆర్ఎస్ తోనే జరుగుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు.రానున్న మూడు నెలలు పార్టీ కోసం,నా కోసం పని చేస్తే ఆ తర్వాత నిరంతరం మీ కోసం పనిచేస్తానన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ ప్రజల కోసం పరితపిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అండగా నిలబడటానికి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్, సర్పంచ్ యాదయ్య,చంద్రశేఖర్ రెడ్డి, సంజీవ తో పాటు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *