జీవం చచ్చిన చైతన్యం
ఉద్యమించని జనం!
నిర్లిప్తంగా మేధోతనం
నిస్తేజంగా యువరక్తం!
ఐక్యత కూడని అభిప్రాయం
ప్రశ్నించని మంత్రాంగం!
ప్రత్యామ్నాయం లేని ప్రభుత్వం
ఫలితం ఊహించని వ్యూహం!
సాగిలపడిన యంత్రాంగం
అహంకారపు అధికారం!
రాజీపడిన దుష్టత్వం
భయం లేని రాజరికం!
సందేహం లేదు!
అదంతా నియంతృత్వ
రాజ్యపు పోకడలే!
సర్వత్రా అణచబడ్డ
మానవ హక్కులే!
సందేహం లేదు!
అక్కడ అదృశ్యంగా
మరుగుతున్నది విప్లవాగ్నులే!
అకస్మాత్తుగా
విరుచుకుపడేవి అగ్ని పర్వతాలే!
– ఉషారం, 9553875577




