సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని సంతోషిమాత ఆలయ నిర్వాహకులు మోని గారి పండరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం అత్యంత భక్తి సిద్ధులతో నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ మోని గారి నారాయణ కుటుంబ సభ్యులు వికారాబాద్ పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *