ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : భారతీయ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ హాజరై మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలనీ, రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన సావిత్రిబాయి పూలే ఎందరికో ఆదర్శప్రాయురాలు అని అన్నారు. కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి.. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను స్థాపించిందన్నారు. అనంతరం కడ్తాల్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల ఉమ్మడి సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, కడ్తాల్ మండల వైస్ ఎంపీపీ బావండ్ల ఆనంద్, కడ్తాల్ మండల కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, కడ్తాల్ ఎంపిటిసి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, రావిచెడ్ ఎంపిటిసి బోబ్బిడి గోపాల్, గ్రామ పెద్దలు చందోజి, భాస్కర్ రెడ్డి, జహంగీర్ అలీ, వార్డు సభ్యులు రాయి కంటి బిక్షపతి, శ్రీను నాయక్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కేశని యాదయ్య, రామచంద్రయ్య, నర్సింహ, చుక్కని అంజయ్య, తుప్పరి వెంకటయ్య, యువజన సంఘం సభ్యులు వెంకటేష్, క్యామ మహేష్, దుడ్డు నాగ రాజు, కాన్గుల గణేష్, గురిగళ్ళ వీర రాగవులు, కావలి కుమార్, పోతగల్ల మురళి పాల్గొన్నారు.
సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్





