సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 13: సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఓటర్లను కోరారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలుపుతూ జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో పూర్తి అవగాహన ఉన్న తనను మళ్ళీ గెలిపిస్తే మిగిలి ఉన్నసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. డివిజన్ పరిధిలోని గోపనపల్లికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా సమక్షంలో బిఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైన అనేక మంది యువకులు పార్టీలోకి చేరడం జరుగుతుందని తెలిపారు. వారి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని పార్టీని మరింత మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ లో చేరిన  వారిలోముఖ్య నాయకులు శ్రీను, నాగేంద్ర , రాజు, నరేష్, కిషోర్ , రాజు, మనోజ్, హరి, నాగరాజు, చంద్రశేఖర్, మణికంఠ, హరి నాని, వినయ్, తిరుపతి, లక్కీ,సచిన్, షేక్ మిస్కిన్,ఇమ్రాన్,ఆసీఫ్,నయీమ్ ఖాన్, మహ్మద్ అమీర్, షేక్ అస్లాం, మహ్మద్ అరిఫ్, అంజద్ ,నవాజ్ ,కరీం, వారి అనుచరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్,డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ ,అనిల్,విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి,వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్ గారు,నరేష్,సతీష్ ముదిరాజ్,అంజమ్మ,ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్,జగదీశ్ ,ఆకుల యాదగిరి,సీనియర్ నాయకులు,రమేష్ గౌడ్,నారాయణ,గోవింద్,అనిల్ సింగ్,శామ్లెట్ శ్రీనివాస్,జగదీశ్,దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్,పరమేష్ ,సలావుద్దీన్, అజ్ మత్,జకీర్,తహర్, బురాన్,ఖాదర్ ఖాన్,మహేష్ యాదవ్,మక్ బూల్,రవీందర్, సుధాకర్,శామ్లెట్ శ్రీకాంత్,శామ్లెట్ యువరాజ్శామ్లెట్ త్రినాథ్,శామ్లెట్ సాయి కుమార్,శామ్లెట్ సాయి కృష్ణ కే వై బాబు అజయ్ గౌడ్,దయాకర్,అర్జున్,అరుణ,కల్పన,బాలమణి,నీరజ,సుగుణ,మాధవి,కుమారి, రేణుక, రాజేశ్వరి,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *