శ్రీ సీతారాముల తిరు కల్యాణానికి ముహుర్తం ఖరారు

ఏప్రిల్‌ 17న శ్రీ సీతారాముల తిరుకల్యాణం… 18న మహా పట్టాభిషేకం
9 నుండి 23 వరకు భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ ప్రధానార్చకులు ముహుర్తాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్‌ 17వ తేదీన శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, 18వ తేదీన మహాపట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వస్తిశ్రీ చాంద్రమాన ‘‘క్రోథి’’ నామ సంవత్సర చైత్ర శుధ్ద పాడ్యమి మంగళవారం నుండి చైత్ర శుద్ద పూర్ణిమ మంగళవారం వరకు అనగా ఏప్రిల్‌ 9వ తేది నుండి ఏప్రిల్‌ 23వ తేది వరకు వసంత పక్ష త్రయుక్త శ్రీ రామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 9వ తేది క్రోధి నామ సంవత్పర ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో 9 గంటల నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13వ తేది పంచమి శనివారం మండల లేఖన కుండ కలశ యాగశాల అలంకరణాదుల సార్వభౌమవాహన సేవ, 14వ తేది షష్టి ఆదివారం మేష సంక్రమణము, ఉదయము గరుడధ్వజరోహణము రాత్రి భేరితాడనం దేవతాహ్వానం, బలిసమర్పణం, మణుమంత వాహన సేవ, 16వ తేది అష్టమ జయరామవరం ఉదయం యాగశాల పూజ చతు:స్థానాచార్చనము, రాత్రి గరుడవాహన సేవ, ఎదుర్కోలు సేవ. 17వ తేది శ్రీ రామనవమి బుధవారం ఉదయం 10.30 నిమిషాల నుండి 12.30 నిమిషాల వరకు శ్రీ సీతారామురల తిరుకల్యాణోత్సవం, సాయంత్రం శ్రీ రామ పునర్వి దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహన సేవ. 18వ తేది దశమి గురువారం ఉదయం మహాపట్టాభిషేకం రథోత్సవం, 19వ తేది సర్వ ఏకాదశి శుక్రవారం ఉదయం చతు:స్థానార్చన, రాత్రి సద్యస్యం  హంసవాహన సేవ. 20వ తేది ద్వాదశి శనివారం ఉదయం చతు:స్థానార్చన, రాత్రి తెప్సోత్సవం చోరోత్సవం అశ్వవాహన సేవ, 21వ తేది త్రయోదశి ఆదివారం ఉదయం చతు:స్థానార్చర రాత్రి ఊంజల్‌ సేవ, సింహవాహన సేవ, 22వ తేది చతుర్ధశి సోమవారం నాడు ఉదయం వసంత్సోవం, హవనం, రాత్రి గజవాహన సేవ, 23వ తేది పూర్ణిమ జయవారం ఉదయం చక్రతీర్ధం, సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి, శేషవాహణ సేవ, ధ్వజావరోహనం, దేవతోద్వాసనము, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీ పుష్పగానం, బ్రహోత్సవములు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *