నయనానందకరం….జగదభిరాముని కల్యాణం
నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు
ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం
రేపు భదాద్రి రాములోరి కల్యాణం
నయనానందకరం….జగదబిరాముని కల్యాణం
ప్రత్యక్షంగా దేవదేవుని పెళ్లి వేడుకును కనులారా వీక్షిస్తే అంతకుమించిన మహాత్భాగ్యమేనని అందుకే నయనానందకరంగా సాగే శ్రీ సీతారాముల పెళ్లి వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ఆ రోజుల్లో రాష్ట్రంలోని దారులన్ని రామనామంతో రామనవమి వైపుకే నడిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆ నాడు సాగే కళ్యాణతంతు భక్తుల జీవితాల్లో పదిలంగా ఉండిపోతుంది. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ధృవమూర్తుల కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలు రామనామ స్వరాల మధ్య అత్యంత వైభవంగా పల్లకిలో మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపానికి తోడుకుని వొస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం నిర్వహించి సర్వశాంతికై విశ్వక్సేన పూజలు నిర్వహిస్తారు.
నేటికి రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు
భక్తరామదాసుగా ప్రసిద్దికెక్కిన కంచర్ల గోపన్న రామాలయం నిర్మించిన కాలంలో సీతారాములకు బంగారు ఆభరణాలు చేయించారు. ఆ నాడు సీతమ్మ తల్లికి రామదాసు చేయించిన మంగళసూత్రాన్నే ఇప్పటికి కూడా ధరింప జేస్తారు. అదేవిధంగా పచ్చల పతకాన్ని రామదాసు రామయ్య తండ్రికి చేయించారు. భరతాగ్రజుడైన శ్రీరామునికి శ్రీరామనవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో ఈ ఆభరణంతో అలకరిస్తారు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకాము రామచంద్రా అంటూ వాగ్గేయ కారుడు రామదాసు కీర్తించిన పతకం ఇదే. ఈ పతకం చక్కగా, ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పతకంలో ఎర్రని రాళ్ళు పొదిగి అందంగా తయారు చేయించారు. రామదాసును చెరనుంచి విడిపించడానికి రామలక్ష్మణులు ఇద్దరు గోల్గొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజి అనే సిపాయిల రూపంలో వెళ్లి ఆలయం నిర్మించడానికి ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణెలుకు బదులుగా 6 లక్షల బంగారు నాణెలు చెల్లిస్తారు. ఆ నాణెలపై ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయ స్వామి రూపం ఉంటాయి. ఆ నాణెనికే రామమాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఈ రామ మాడను శ్రీరామ నవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణ స్వామికి అలంకరిస్తారు.
ముత్యం అంటేనే అతి పవిత్రమైనది. అందునా….సాక్ష్యాత్తు దేవదేవుని శిరస్సులపై నుంచి జాలువారిన ముత్యాలంటే మరింత పవిత్రమైనవి. అందుకే శ్రీ సీతారాముల పెళ్లిలో వాడిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. తానీషా ప్రభువుల కాలం నుంచి శ్రీ సీతారాముల పెళ్లి వేడుకకు ప్రభుత్వం తరుపు నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టుపీతాంబరాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే ఆనవాయతీ నేటికి కూడా శుభప్రదంగా కొనసాగడం ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం తరుపునుంచి ప్రతీ ఏటా ముఖ్యమంత్రి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తుంటారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం తరుపున ఎవరు తెస్తారు వేచి చూడాల్సి ఉంది.
పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అ్న భక్తరామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరత్ను పేరిట చేయించిన ఈ పతక్నా భరతాగ్రజుడైన రామయ్యతండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామ్నుకి అలంకరిస్తారు.
మంగళసూత్రం : మూడు మంగల్యాలు గల మంగళ సూత్న్రా రామదాసుగారు చేయించారు. ఒకటి దశరధ మహారాజుగారి తరుపున, రెండు జనక మహారాజు తరపున, మూడు శ్రీ భక్తరామదాసు గారే కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మహోత్సవము జరుగును.
శ్రీరామ మాడ : రామదాస్ను చెరనుండి విడిపించడ్నాకి రామలక్ష్మణులిద్దరూ గ్కోండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాతో వెళ్ళి, ఆలయం నిర్మించడ్నాకై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణ్నాకే రామ మాడ అ్న పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి మరియు ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.
శ్రీ సీతారాముల కల్యాణ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి లేదు
ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు
సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించండి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంత్రి కొండా సురేఖ మూడోసారి లేఖ
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు 17వ తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 18వ తేది మహాపట్టాభిషేకానికి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి లేదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ టివిలో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రచారం నిర్వహించే వారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం లేదని తెలిసింది. ఒకవేళ ప్రత్యక్ష ఇవ్వాలనుకుంటే కేవలం దేవస్థానం ఖర్చుతోనే నిర్వహించుకోవాలనట్లు తెలిసింది. ప్రభుత్వం ఖర్చుతో అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. గత కొన్నేళ్ళుగా వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి కల్యాణాన్ని వీక్షించే అదృష్టం ఉండేది. నేరుగా కల్యాణం చూడలేని వృద్ధులతో పాటు వికలాంగులు టీవీల వద్ద కూర్చుని కల్యాణం చూసే అవకాశం ఉండేది. ఈ సారి ఎన్నికల కోడ్ ఉండటం వలన ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదని చెప్పినట్లు తెలుస్తుంది. కాగా గతంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు.
సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించండి : మంత్రి కొండా సురేఖ మూడోసారి లేఖ
భదాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన నేపథ్యం లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మూడోసారి లేఖ రాశారు. సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా కల్యాణ మహోత్సవం ప్రత్యక్షప్రసారం జరుగుతుందని చెబుతూ..ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. ఈ నెల 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.





