శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి లో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో కాలనీ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ తనను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై అభిమానం చూపిస్తు,గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యత తో రెట్టింపు ఉత్సహం తో పనిచేసి ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి నా వంతు ఛాయాశక్తులక కృషి చేస్తానని తెలియచేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆర్ ల సహకారంతో 9 వేల కోట్ల నిధు లు వెచ్చించి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని అందరి సహకారంతో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తానని పునరుద్గాటించారు.ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోహర్ గౌడ్, లక్ష్మారెడ్డి, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్,మిద్దెల మల్లారెడ్డి, ఉరిటీ వెంకట్ రావు,ప్రవీణ్, ప్రసాద్, రవీందర్ రెడ్డి, రాజు యాదవ్, తిరుమలేష్ ,సిద్ధి రాములు, లక్ష్మీ, మాధవి,రాదమ్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం





