హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బిఆర్ఎస్ బండ ప్రకాష్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీలతో కలిసి సమర్పించారు. ఈ కర్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదనచారి, విజి గౌడ్, తాత మధు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బిఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్లొన్నారు.




