శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

ఇబ్రహీంపట్నం ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలతో,కలిసి గురువారం నియోజకవర్గంలో 73 కోట్ల 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ,తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సర్కారు దవాఖానాలు 32 శాతం డెలివరీలు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో 72.8% ప్రసవాలు అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రైవేటు దాదాఖానాల సంఖ్య ఎక్కువ ఉండేదని నేడు 72% ప్రభుత్వ ఆసుపత్రులు 28% ప్రైవేటు ఆసుపత్రులు మంచిగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి పరుస్తున్నామని బిడ్డ కడుపులో ఉండి పుట్టగానే కెసిఆర్ కిట్టు అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 11 లక్షల మందికి కిట్లు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రసవాలు జరిగిన తర్వాత తల్లి బిడ్డలను ఎలాంటి ఖర్చులు లేకుండా నేరుగా ఇంటి వద్దకే పంపుతున్న విషయం ప్రజలకి తెలుసన్నారు.గర్భందాల్చిన తల్లులకు తెలంగాణ ప్రభుత్వ హాయంలో మరో రెండు పథకాలు ప్రవేశపెట్టామని ఆరోగ్య లక్ష్మి, అమ్మబడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.అంగన్వాడి స్కూల్లో గర్భిణీలకు పాలు గుడ్లు పెట్టి వారికి పోషక ఓదార్థాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి అన్నారు.గత ప్రభుత్వాలలో మహిళలు బిందెలు పట్టుకొని మంచినీటి కోసం రోడ్డుపై పడి కాపులు కాసేవారని నేడు మహిళలు రోడ్డు ఎక్కకుండా కెసిఆర్ మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నారని ఆయన తెలిపారు.కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆడపిల్లల పెళ్లిలకు ఒక రూపాయి కూడా చెల్లించలేదని ఆయన విమర్శించారు.ప్రతి పేదింటి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.200 ఉన్న పింఛను రెండు వేలకు, 4000 ఉన్న రైతు బంధువుని 5 వేలకు 75000 ఉన్న కల్యాణ లక్ష్మి పెంచడం కేసీఆర్ వల్లే సాధ్యమైందని మంత్రి ప్రజలకు తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో రెండు మెడికల్ కళాశాలలు వచ్చాయని అందులో ఒకటి ఇబ్రహీంపట్నం,మహేశ్వరం నియోజకవర్గం మద్యలో రానున్న కాలంలో అద్భుతంగా నిర్మించుకోనున్నామని హరీష్ రావు తెలిపారు.తూచ తప్పకుండా ఇచ్చిన హామీని కెసిఆర్ రుణమాఫీ చేసి చూపించారన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్,పలు శాఖల అధికారులు,బిఆర్ఎస్ నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *