హైదరాబాద్, ఫిబ్రవరి 25 : శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ ఇఐ-528 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 823 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని అండ్ వేర్ లో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ 47 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడు పాతబస్తీకి చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.




