దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్
బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్ చుగ్
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్ అహంకారాన్ని దించాలని కోరారు. మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఎనిదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ చేసిందేవి• లేదని తరుణ్ చుగ్ అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితబంధు పేరుతో దళితులను కేసీఆర్ మోసం చేశారని..ఎవరికి దళిత బంధు రాలేదన్నారు. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డిని, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు పోల్చి చూడాలని కోరారు. ఇద్దరిలో ఎవరి మంచివారో..ఎవరు ప్రజలకు సేవ చేస్తారో…ఎవరు కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడ్డారో ఆలోచించాలన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు ప్రజల గెలుపన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు తెలంగాణ గెలుపు అని తరుణ్ చుగ్ చెప్పారు. సీఎం కేసీఆర్ కు అందరిని వాడుకొని వదిలేయడం కామన్ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైన ఆయనకు బుద్ది చెప్పకపోతే నష్టపోతామన్నారు. మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజగోపాల్.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామనన్న కేసీఆర్ నట్టేట ముంచారన్నారు.
అవినీతి సొమ్ముతో గెలవాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్చు చెప్పాలన్నారు. మంత్రి కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాతున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డ బండి సంజయ్ యాదాద్రి ప్రమాణం చేస్తే గుడిని సంప్రోక్షణ చేయాలనడమేంటన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ పేద ప్రజలకు న్యాయం చేయలేదని రాజగోపాల్ అన్నారు. కేసీఆర్ అధికారం, డబ్బును నమ్ముకుని వస్తే.. తాను జనాన్ని నమ్ముకుని వచ్చారని చెప్పారు. అవినీతి సొమ్ముతో టీఆర్ఎస్ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ పాలనలో దళితుల జీవితాలు బతుకులు మారలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తా అని ఇయ్యలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు డగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక..అందరికి వీరందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ గద్దె దిగాక..తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లక్ష్మీనరసింహస్వామి పేరు ఉచ్ఛరించినందుకు కేసీఆర్, కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు.
బీజేపీ తప్పు చేయలేదు కాబట్టే తాను..యాదగిరిగుట్టకు వెళ్లి తడబట్టలతో ప్రమాణం చేశానని బండి సంజయ్ తెలిపారు. తాను ప్రమాణం చేయడం వల్లే బీజేపీ నిజాయితీ ప్రజలు తెలిసిందన్నారు. కేసీఆర్ తప్పు చేయకుంటే యాదగిరిగుట్టకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎందుకు తన సవాల్?ను స్వీకరించలేదన్నారు. కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టే..గుట్టకు రాలేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు గత మూడు నాలుగు రోజులుగా ప్రగతి భవన్లోనే ఉన్నారని… తప్పుచేయకపోతే వారిని ప్రగతి భవన్లో దాచాల్సిన అవసరం ఏముందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని బండి సంజయ్ మండిపడ్డారు.
మునుగోడు ప్రాంత ప్రజల ఇబ్బందికి కారణం కేసీఆరే అని చెప్పారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు ఉంటే..అప్పటి ముఖ్యమంత్రితో కేసీఆర్ కుమ్మక్కై…299 టీఎంసీలకే ఒప్పుకున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రాంతాన్ని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ డబ్బులతో కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు..గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీది జోడో యాత్ర కాదని..టీఆర్ఎస్ కాంగ్రెస్ జోడు యాత్ర అని చురకలంటించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీని ఆపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అమిత్ షా సభ సమయంలో, రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సమయంలో కావాలనే ట్రాఫిక్?ను సృష్టించారని చెప్పారు. అక్టోబర్ 31న – ఒకే రోజు 9 బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని విషయాలను ప్రజలు వివరించి ఓట్లు అభ్యర్థిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకట స్వామి , దళితనేతలు చంద్రశేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



