ఎన్నికల సైరన్ మోగకనే
పొలిటికల్ నేత గణాలు
తెగ సందడి చేస్తున్నాయ్
బహురూపుల వేశంగట్టి
వోట్ల వేటకు కదిలినయ్
కపట నాటక ప్రదర్శనతో
కట్టు కథలు చెప్తున్నాయ్
ప్రజలే దేవుళ్ళు అంటూ
గొంతెత్తి నినదిస్తున్నాయ్
అసత్యపు ప్రచారాలతో
సభల జోరెత్తిస్తున్నాయ్
అభివృద్ధి మంత్ర జపంతో
దొంగ దీక్ష సాగిస్తున్నాయ్
పార్టీల జెండాలు ఎత్తుకు
వీధుల్లో సంచరిస్తున్నయ్
పాలనా పీఠం అధిష్టించ
యాతన పడుతున్నాయ్
ఇపుడు వోటరు ధీరులు
ఉన్మత్తునిలా నటించాలి
కుహనా నేతల కుట్రలు
మాటుగానే పసిగట్టాలి
మొక్కుబడిగ ‘ఊ’కొట్టి
సమ్మతిని ప్రకటించాలి
ఎన్నికల శుభ దినమున
గురుతు ఎరిగి గురి పెట్టి
ఓటు అస్త్రం సంధించాలి
స్వార్థపరుల్ని గద్దె దించి
సమర్ధులకు పట్టంగట్టాలి
ప్రజాస్వామ్యాన్ని రక్షించి
వోటరు ‘‘ పవర్ ‘‘ చాటాలి
(పొలిటికల్ పార్టీల ఎలక్షన్ సందడిని ఊటంకిస్తూ…)
– కోడిగూటి తిరుపతి, 9573929493.




