వైభవంగా చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహ ప్రతిష్ట

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4: మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ పూజలు శనివారం వైభవంగా జరిగాయి.ఆ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 1995-96 పదవ తరగతి  బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు చేశారు.  వేద పండితుడు అజయ్ శర్మ ఆధ్వర్యంలో  హోమము,పూజలతో పాటు అమ్మవారికి  వాయు ప్రతిష్ఠ పూజలు నిర్వహించారు.  పాఠశాల  ప్రాంగణం  ప్రస్తుత,పూర్వ విద్యార్థులతో వేద మంత్రోచ్చరణాల మధ్య   భక్తి పరవశంతో మునిగిపోయారు. ఈకార్యక్రమంలో పూర్వ ప్రధానో పాధ్యాయులు గోపాల కృష్ణ,వెంకటేశం, పెంటారెడ్డి,సుదర్శన్,ప్రస్తుత ప్రధానో పాధ్యాయులు అంజయ్య,కవిత,మురళీ మనోహర చారి,భూమిరెడ్డి,యాదగిరి, జైపాల్ రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,అజయ్ రెడ్డి,బి.ఎల్లారెడ్డి,జి.ఎల్లారెడ్డి,ప్రభాకర్ రెడ్డి, నవీన్,హరికిషన్ రెడ్డి,శ్రీరాములు,జ్యోతి, నీరజా,వనజ,కల్పన,అశోక్,కె.సత్యనారాయణ,వెంకట్ స్వామి,రాఘవులు,యాదగిరి, శ్రీను,రవి,మహేందర్,అంజయ్య,నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *