వైబి చవాన్‌కు ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ ‌నివాళి

ముంబై, జూలై 3 : మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ  అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మంబై నుంచి సతారా జిల్లాలోని కరాడ్‌కు చేరుకుని యశ్వంత్‌రావు చవాన్‌ ‌సమాధిని సందర్శించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శరద్‌పవార్‌ ‌వెంట మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు పృథ్వీరాజ్‌ ‌చవాన్‌ ‌కూడా ఉన్నారు.

ఎన్సీపీలో అజిత్‌ ‌పవార్‌ ‌చీలిక తెచ్చిన మరుసటి రోజే సతారాకు చేరుకున్న శరద్‌పవార్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. పవార్‌ ‌చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా, అజిత్‌ ‌పవార్‌.. ఆదివారం ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించారు. అజిత్‌ ఉప ముఖ్యమంత్రిగా, మిగతా 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరో 30 మందికిపైగా తమతోనే ఉన్నారని అజిత్‌ ‌పవార్‌ ‌వర్గం చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *