- వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు
- నిబద్ధతతో అందిస్తున్న సేవలు
- అభినందనీయం : ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, జూలై 1 : హైదరాబాద్ లోని కోకాపేట , నానక్ రామ్ గూడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిశ్ రావు క్యాంప్ కార్యాల యంలో ప్రజా డైరీ ప్రజా మీడి యా 9 ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వ ర్యంలో నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజా డైరీ సెలబ్రిటీ అవార్డస్ ప్రదానోత్స వం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు , విశిష్ట అతిథిగా ప్రముఖ నటుడు హీరో సుమన్ తో కలిసి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి ‘‘సెలబ్రిటీ అవార్డుల’’ను మంత్రి చేతుల మీదుగా అందజేసిశారు.
ఈ సందర్బంగా సన్మానం తో పాటు పలువురు డాక్టర్స్ కి మెమెంటో లు అందజేశారు. తదనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు, సుమన్, ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడారు. దైవ సమానులైన వైద్యులు అందరికీ దేవుడు ప్రా ణం పోస్తే …వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని అందుకే వైద్యులను దేవుడితో సమానం అంటార న్నారు. ఆపద సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది ప్రాణాలను కాపా డుతున్న వైద్యుల సేవలు వెలకట్టలేనిదన్నారు. గతంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజ లకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతికించే ఓ మహా శక్తిగా అభివర్ణించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అన్ని వేళలా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా డైరీ ఎడిటర్ వి. సురేష్, డా. కిరణ్, డా. పల్లవి, డా. స్మిత ఆళ్లగడ్డ, డా. ఎమ్. సాయి కిరణ్, డా. నారాయణ రెడ్డి, వెంకట్ రావు, ముఖేష్, ప్రవీణ్, హనుమం తరావు, శ్రీకాంత్ రెడ్డి, వైవి రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ లు, తదితరులు పాల్గొన్నారు




