వై ఎస్ ఆర్ సంక్షేమ పథకాలే ఇప్పటికి అమలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికి అమలు అవుతున్నాయి. అని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, పిసిసి సభ్యుడు ధర్పల్లి చంద్రం మాట్లాడుతూ ప్రజల మద్దతుతో రెండుసార్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. అలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన అందరి హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. అలాంటి నాయకుడు కలలుగన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రానున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి పథకాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తప్పెట శంకర్, గ్యదరి మధు, గయాసుద్దీన్, సుంచు రమేష్, రాషద్, రఘుపతి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.ఆయన లాంటి గొప్ప నాయకుని కోల్పోవడం బాధాకరం
ఆయ-సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *