వెలిమెల మోడల్ స్కూల్ ను సందర్శించిన మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీదేవి గురువారం రామచంద్రాపురం మండలం వెలిమెల తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా సంస్థ పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అకడమిక్ పనితీరును మెరుగుపరిచేందుకు, మోడల్ స్కూల్స్ ప్రతిష్టను కాపాడేందుకు తగిన సూచనలు చేశారు. మోడల్ స్కూల్స్‌లో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో జాయింట్ డైరెక్టర్ విలువైన మార్గదర్శకత్వాలను, తమ పూర్తి సహకారాన్ని అందించినందుకుగాను ప్రిన్సిపాల్ రాoప్రసాద్, జాయింట్ డైరెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. జాయింట్ డైరెక్టర్‌ను ఇంచార్జి ప్రిన్సిపాల్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *