వెన్నుపూసలేని రాష్ట్ర బిజెపి నేతలు

  • కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పోయినా మాట్లాడరా..?
  • మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
  • ‌కల్లాల నిర్మాణంపై కేంద్రం దుష్ప్రచారం

కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్‌
‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్టాన్రికి చెందిన బీజేపీ నేతలు విఫలం అయినట్లు ఆయన తెలిపారు. రాష్టాన్రికి కోచ్‌ ‌ఫ్యాక్టరీ వాగ్దానం చేశారని, కానీ బీజేపీ నేతలు ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో సక్సెస్‌ ‌కాలేకపోతున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోచ్‌ ‌ఫ్యాక్టరీలను కేటాయిస్తుంటే, మరెందుకు మన రాష్టాన్రికి ఆ నేతలు కోచ్‌ ‌ఫ్యాక్టరీని తీసుకురాలేకపోతున్నట్లు ఆయన ప్రశ్నించారు.

అస్సాం రాష్టాన్రికి కోచ్‌ ‌ఫ్యాక్టరీని రైల్వే శాఖ కేటాయిస్తున్నట్లు తెలిసింది. అయితే అస్సాంకు కోచ్‌ ‌ఫ్యాక్టరీని కేటాయించడం పట్ల సంతోషంగా ఉందన్న మంత్రి కేటీఆర్‌.. ‌తెలంగాణ బీజేపీ నేతలు వెన్నుపూసలేని వారిగా తయారైనట్లు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీనిపై బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని ఆయన తన ట్విట్టర్‌ ‌ద్వారా ప్రశ్నించారు. భారతీయ రైల్వేశాఖ అస్సాంలోని కోక్రాజార్‌లో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇండియన్‌ ‌టెక్‌ అం‌డ్‌ ఇన్‌‌ఫ్రా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలిపింది. ఆ ట్వీట్‌ ఆధారంగా మంత్రి కేటీఆర్‌ .. ‌తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు.

కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్‌
‌కేంద్రరైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బిఆర్‌ఎస్‌ ‌పిలుపునచ్చింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హావి• పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హావి నిధుల మళ్లింపు అంటూ దుష్పచ్రారం చేస్తున్నదని కేటీఆర్‌ ‌మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, రాష్ట్రం పైన అసత్య ప్రచారం చేస్తున్నందుకు శుక్రవారం అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు మంత్రి పిలుపునిచ్చారు. కాగా ఉపాధి హావి పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదులసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్‌ ఈ ‌సందర్భంగా గుర్తు చేశారు. అయినా కేంద్రం స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్‌ ‌చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హావికి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు.

గ్రామాలలో కొవిడ్‌ ‌కష్టకాలం తర్వాత ఉపాది అవకాశాలు తగ్గాయని, గ్రావి•ణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుం టున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హవి•కి నిధులు తగ్గిస్తూ వొస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్‌ ‌ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హవి•ని అనసంధానం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *