విశ్వ మానవ కల్యాణం

నా పేరే శౌర్యం

నా ఊరే చైతన్యం

నా పనే కర్తవ్యం

నా ఉనికే ధైర్యం

 

నా హృదయమే

కారుణ్యం

నా మనసే వైశాల్యం

నా చెలిమే సౌజన్యం

నా పరిచయమే ఓ భాగ్యం

 

నా ప్రయాణం

సౌకర్యం

నా నడతే ఆదర్శం

నా నడకే ఆరోగ్యం

నా మాటలే కడు రమ్యం

 

నా పాటలే మాధుర్యం

నా బాటే సౌకుమార్యం

నా ఆటే సుమ సౌమ్యం

నా కవితే సౌందర్యం

 

నా మమతే అనిర్వచనీయం

నా ఆశయం సర్వమానవ సమానత్వం

నా లక్ష్యం విశ్వ జన సౌభ్రాతృత్వం

నా గమ్యం

విశ్వ మానవ కళ్యాణం

 

– గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం)., ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,తెలుగు పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి., 9493235992

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *