తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: కోర్టులో కేసు నడుస్తున్న వివాదాస్పద స్థలంలో అక్రమంగా విద్యుత్ అధికారుల నిర్మాణాలను చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని అట్టి స్థలం జిపిఏ వోల్టర్ నయీమ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి సర్వేనెంబర్ 52 లో గల 6 ఎకరాల5 గుంటల స్థలం
ఉండగా విద్యుత్ శాఖ అధికారులు అట్టి స్థలాన్ని కబ్జా చేసి 3 ఎకరాల 5 గుంటల ఖాళీ స్థలంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, అట్టి భూమికి సంబంధించిన జిపిఏ హెూల్డర్ నయీమ్ ఖాన్ ఆరోపించారు. ఇట్టి స్థలాన్ని సంబంధించి వికారాబాద్ ఏ డి జె ఓఎస్ 102/ 2019 కోర్టులో కేసు పెండింగ్లో ఉందని స్థల జీపీఏ హెూల్డర్ పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టు ఉల్లంఘనకు పాల్పడి నిర్మాణాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.వివాదాస్పద స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టినకు ప్రయత్నిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విద్యుత్ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టు తీర్పు పెండింగ్లో ఉన్నందున తీర్పు వెలువడే వరకు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోరారు. సంబంధిత కాంట్రాక్టర్ ప్రతిసారి ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు చూస్తున్నారని కోర్టు తీర్పు మాకు వస్తే తప్పకుండా నష్టపరిహారం తీసుకుంటామని వాళ్లు గెలిస్తే నిరభ్యంతరంగా ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చని అన్నారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యుత్ అధికారులపై కూడా కోర్టులో దావా వేసినట్టు తెలిపారు.





