ఏమోయ్
కాసింత కాఫీ ఇస్తావా?
ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్ అవుతున్నారు
రేపటి ఉపన్యాసం గురించి
అవునా… దేని గురించండి?
విముక్తి గురించి
ఏమోయ్
మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా
ఏంటండీ అంత ఆకలిగా ఉందా?
లేదులే! మా మిత్రుడొకరు
ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు
అవునా… దేనిమీదండి?
విముక్తి మీద
ఏమోయ్
సాయంత్రం మాంచి స్నాక్స్ చేసి పెట్టవా
ఒక కవిత రాయాలి
అవునా… అంశం ఏంటండీ?
విముక్తి…
అవునండీ నాకోటి చెబుతారా?
పొద్దుటి నుండి మీ విముక్తి కృషి
ఏ విముక్తి గురించండి?
స్త్రీల విముక్తి గురించి
అవునా… అందులో నేనుంటానా అండి?
అదేంటోయ్….
నీకు విముక్తి ఏంటి నిన్ను ఇంట్లో పెట్టుకుని
సుఖంగా చూసుకుంటున్నాగా!
అవునా.. దాన్ని విముక్తి అంటారా?
బాగుందండి మీ విముక్తి శ్రమ
కొనసాగించండి… మబ్బుల పై
– దిలీప్.వి
జిల్లా ప్రధానకార్యదర్శి
మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్:8464030808




