న్యూ దిల్లీ, డిసెంబర్ 22 : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో మళ్లీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.ఎఫ్.7 కేసులు వెలుగుచూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుండి దేశంలోని అన్ని విమానాశ్రయా ల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల నుండి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. బెంగళూరు సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి.
రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశించింది. అయితే కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని సీరం ఇన్‌స్టిట్యూట్ సిఇఒ అదర్‌పూనావాలా పేర్కొన్న సంగతి తెలిసిందే. కేంద్రం సూచించిన విధంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేశారు. ప్రతివారం కరోనా సక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.



