ప్లామెంటులో కాంగ్రెస్ ఎంపి అధీర్ రంజన్
న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్ పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు.
తమ వద్ద ఉన్న ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవిని ప్రభుత్వం గుంజుకున్నట్లు అధిర్ ఆరోపించారు. విపక్షాల వద్ద ఉన్న అన్ని హోదాల్ని బీజేపీ సర్కార్ అంతం చేస్తున్నట్లు ఆయన విమర్శించారు. పార్లమెంట్లో విపక్షాలకు ఎటువంటి అధికారం దక్కకుండా చూస్తున్నారని అధిర్ ఆరోపించారు.



