వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వినాయక చవితి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్, ఎంఐజి పలు కాలనీలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని స్థాయిల్లోనూ కూడా యువత శక్తి ముఖ్యమైనదని వారు తలుచుకుంటే ఏదైనా అవుతుందని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. మంచి నేతను ఎన్నుకోవాలంటే యువతతో సాధ్యమని ఆయన తెలిపారు. యువశక్తి ముందు ఏమీ పని చేయవని ఆయన అన్నారు. అలాంటి యువతకు తాను ఎప్పుడు అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యువజన సంఘ సభ్యులు నీలం మధు ముదిరాజ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాలనీవాసులు,యువత, ఎన్ఎంఆర్  యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *