ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్ పాఠశాల)ను స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శంకరయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తకపఠనాన్ని పెంపొందించుకొని,క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలన్నారు.ప్రతి విద్యార్థి చదవడం,రాయడం తప్పని సరిగా నేర్చుకోవాలని సూచించారు.హెడ్ మాస్టర్ మాణిక్యరావు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.




