- అక్షరం ఆయుధం కన్నా గొప్పది..
- అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది..
- అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది..
ప్రతియేడాది సెప్టెంబర్ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది. ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం.
ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగు నిస్తుంది. విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలు బట్టిపట్టడం కాదు. ఈసమాజంలో బతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అక్షరాస్యత కిందే వస్తుంది. ఒకరి నుంచి మోసపోకుండా ఉండేందుకు విద్య ఉపయోగ పడుతుంది. నేడు నిరక్ష్యరాస్యులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే త్వరగా మోసపోతూ ఉంటారు. దీనికి కారణం అక్షరాస్యతకు వారు దూరంగా ఉండటమే. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినా.. ఈలక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులే. ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఐక్యరాజ్యసమితి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే… అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనేగాకుండా, వయోజన విద్యమీద కేంద్రీకరి ంచబడుతుంది.అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం 2023 థీమ్: ‘పరివర్తనలో ఉన్న ప్రపంచం కోసం అక్షరాస్యతను ప్రోత్సహించడం: స్థిరమైన మరియు శాంతియుత సమాజాలకు పునాదిని నిర్మించడం’
మనం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము..?
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అక్షరాస్యతపై అవగాహన పెంచడం, తద్వారా ప్రతి ఒక్కరూ వారి సామాజిక మరియు వ్యక్తిగత హక్కులను తెలుసుకుంటారు. మనం జీవించడానికి ఆహారం అవసరం కాబట్టి, మన వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధికి అక్షరాస్యత అవసరం. పేదరికం రేటులో అపారమైన పెరుగుదల, అనియంత్రిత జనాభా పెరుగుదల, లింగ అసమానత మొదలైన వాటి నేపథ్యంలో, ఈ సమస్యలను తొలగించే లక్ష్యంతో యునెస్కో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.
వారి నిర్మూలన వ్యక్తులు ఎదగడానికి మాత్రమే కాకుండా దేశం యొక్క మొత్తం ఎదుగుదలకు మరియు పురోగతికి దోహదం చేస్తుంది
యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే… విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా ‘‘అంతర్జాతీయ నాయకత్వం’’ కోసం అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం. సాంస్కృతిక, శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్లను ప్రోత్సహించడం లాంటివి చేస్తుంది.
విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం, తెగిన జీవితాలకి ఆధారం, విద్య ఓ శిఖరం…..
మనిషినీ మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే..
విషయ పరిజానంతో బాటు అక్షరజానం ఉంటేనే, ఏం జరుగుతుందో.? ఏం చేస్తున్నామో.? ఒక అవగాహన కలిగి ఉంటాము. కావునా నేడు విద్య చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది….చదువుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి, పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధము, ప్రశాంతమైన వాతావరణంలో, వారి ఇష్ట ప్రకారం విద్యావంతులు అయ్యేలా మార్గదర్శకం చేయాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యను అందించాలి. అప్పుడే వారు సంతోషంతో మరింత సమర్థవంతంగా నేర్చుకోగలరు. విద్య అంటే కేవలం పుస్తకాలే కాదు… అదనపు పాఠ్య ప్రణాళిక కార్యకలాపాలు… అనగా ఆటలు, పాటలు, కళలు మరియు వ్యాయామం మొదలగునవి. ఇవి కూడా విద్యలో ఒక భాగమే… వీటితో పాటు విద్యను అందించడం ద్వారా పిల్లలు మరింత విజ్ఞానవంతులుగా తయారవుతారు. కాబట్టి విద్యను బేఖాతరు చెయ్యొద్దు.
‘‘నీ లోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే అసలైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని మించిన పుస్తకం ఏముంటుంది?’’ ….ఎమ్.కె.గాంధీ
ఎంఏ. ఏంఎడ్, సెట్, పిజిడిసిఎ.పొలిటికల్ సైన్స్ లెక్చరర్.బీసీ గురుకుల కళాశాల సికింద్రాబాద్
కంటోన్మెంట్ (బాయ్స్)




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల