విజేతలకు నగదు బహుమతుల అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కడ్తాల మండలంలోని గానుగు మార్ల గ్రామపంచాయతీలో  ఇటీవల జర్పుల రాధాకృష్ణ 20వ జయంతి సందర్భంగా నిర్వహించిన  క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మొదటి బహుమతి రూ.12వేల నగదు. రెండో బహుమతిగా రూ.6వేలు విజేతలకు అందించారు. ఈ టోర్నమెంట్ లో జిఎంటి కింగ్స్ దీనికి మొదటి బహుమతి లభించగా, జిఎంటి జూనియర్స్ కు రెండో బహుమతి లభించింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ  గెలుపోటములు సహజమని ఓటమిని పునాదిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరయ్య, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపిటిసి ప్రియా  రమేష్, డైరెక్టర్  సేవ్య నాయక్, నాయకులు పాండు, రూప్సింగ్, రాజు, గణేష్, ఇర్షాద్, వెంకటయ్య, సక్రు,  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *