ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి5: గత రెండేళ్లుగా తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు నడుమవీగిపోయింది. అవిశ్వాస తీర్మానికి ఆరవక వ్యవహరించిన ఆర్డీవో శిరీష తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది. అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది కౌన్సిలర్లు కావలసి ఉండగా కేవలం 15 మంది మాత్రమే సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో సమావేశం ఏర్పాటు చేసి రెండు దఫాల అవకాశమిచ్చినప్పటికీ మిగిలిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో ప్రకటించ మన్నారు.
అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయం వస్తున్న మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు, 23 వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ ను కిడ్నాప్ చేసినట్లు టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏది ఏమైనా తీవ్ర ఉద్రిక్తల నడుమ అవిశ్వాస ఉత్కంఠకు స్థిరపడింది.





