కేసీఆర్ నాయకత్వం వర్థిలాలి : బీఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్15: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని,ఈ మేనిఫెస్టోతో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల చేయడంతో ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు.వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ ను గెలిపించాలని కోరారు. మహిళలకు రూ.400 గ్యాస్ కనెక్షన్ ఇస్తానడంతో వంటింటి మహిళలకు చేయూత అందుతుందన్నారు.వికలాంగులకు రూ.6000 పింఛన్లు, వృద్ధులకు, వితంతువులకు రూ.5000 పింఛన్ చేస్తానన్నారు.రైతులకు అందిస్తున్న రైతు బంధు రూ.10,000 నుంచి 15,000 పెంచుతారన్నారు.కేసీఆర్ మేనిఫెస్టోలో లేనివి ఎన్నో పేద ప్రజల కోసం చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనంత్ రెడ్డి, శనగల రాములు, బీఆర్ఎస్ నాయకులు అనంత్ రెడ్డి, మేక చంద్రశేఖర్, ప్రవీణ్ కడియాల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.





