వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలని పిఎన్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలోని  పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు లేకపోవడం ఇక్కడున్న ప్రజలు వలస కార్మికులుగా పూనా, బాంబే, హైదరాబాద్ లలో జీవనం కొనసాగిస్తున్నారు.యువకులు ఎక్కువ మంది నిరుద్యోగులుగా వున్నారు.వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత వికారాబాద్ జిల్లాను పునర్విభజన చేయాలని అన్నారు. జిల్లాలో పరిశ్రమలు లేకపోవడం నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోవడం ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి చేవెళ్ల పార్లమెంటు భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉందో మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్లతో వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గం వరకు పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా జిల్లా హెడ్ క్వార్టర్ మన్నెగూడ నుంచి చేవెళ్ల మధ్యలో నెలకొల్పి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జిల్లాను విభజించడం ఈ ప్రాంత  గ్రామపంచాయతీలకు  నిధుల  విషయంలో కానీ యువకులకు ఉద్యోగ విషయంలో కానీ ప్రస్తుత ఉద్యోగుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి భరత్, శరత్, ఆంజనేయులు, శ్రీకృష్ణ, రామకృష్ణ, నరేష్, హరికృష్ణ, యువజన సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *