తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 30: వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకుడు సయ్యద్ ముజీబ్ వికారాబాద్ జిల్లా ముస్లిం జేఏసీ కన్వీనర్ గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా ముజీబ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా మాట్లాడుతూ ముస్లింల హక్కుల సాధన కోసం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నిరంతరం పోరాటం చేస్తుందని, ముస్లింలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం మనం అందరం కలిసి కట్టుగా పని చేసి మన హక్కులు సాధించుకోవాలని, సచార్ కమిటీ తెలిపిన నివేదిక ప్రకారం ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని ఇకనైనా మనం మెల్కోనాలని అప్పుడే మనకు రావాల్సిన హక్కులు మనకు దక్కుతాయని అన్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ గా నియామకమైన ముజీబ్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా గారికి రాష్ట్ర కో కన్వీనర్ యూసుఫ్(స్కై) బాబా గారికి మరియు రాష్ట్ర ఎక్జిక్యూటివ్ మెంబర్ జహీర్ పాషా గారికి సయ్యద్ ముజీబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




