వర్షాలతో అప్రమత్తం…అన్ని రంగాలను సర్వసన్నద్ధం

  • వరద ప్రమాద ప్రాంతాల్లో చురుకుగా చర్యలు
  • గోదావరి పరిసరాల్లో మరింత అప్రమత్తం
  • వర్షాలు, వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవి•క్ష
  • భారీవర్షాలతో పోలీసులు అప్రమత్తం కావాలి  : డిజిపి ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను  సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్‌ ‌శాఖలపై శుక్రవారం సీఎం కేసీఆర్‌ ‌సవి•క్ష జరిపారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంతో పాటు, కలెక్టరేట్లో, ఎమ్మార్వో ఆఫీసులలో కంట్రోల్‌ ‌రూంలను ఏర్పాటు చేసింది.

సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను, ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కంట్రోల్‌ ‌రూమ్‌ ‌సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు, భద్రాచలంలో సహాయక చర్యలకు ఏర్పాట్లపై కేసీఆర్‌ ‌సవి•క్షించారు. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సవి•క్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భారీ వర్షాలు, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్ల అంశంతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ ‌చర్చించారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌పరిశ్రమల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. హైదరాబాద్‌ ‌సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుందని మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోనూ వర్షాలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తాయి. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌ ‌రావు, గంగుల కమలాకర్‌, ఎం‌పీ దామోదర్‌ ‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

భారీవర్షాలతో పోలీసులు అప్రమత్తం కావాలి  : డిజిపి ఆదేశం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తమ వంతుగా సేవలను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్‌ ‌పోలీస్‌ అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, పోలీస్‌ ‌కమిషనర్లతో డీజీపీ శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు.

వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్‌ ‌శాఖ నుంచి ప్రజలు తగు సహాయ సహకారాలకు ఎదురుచూస్తారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ నాయకత్వ ప్రతిభను చూపించి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  భదాద్రి కొత్తగూడెం లోఉన్న ఐజీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *