హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా మనువాద దోపిడీ శక్తులు ఎం.ఆర్.పి.ఎస్ ఆధ్వర్యంలో చేయిస్తున్న ఎస్సీల విభజన వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినా దానికి మద్దతూ ఇచ్చే రాజకీయ పార్టీలను సమాధి చేస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ విఎల్.రాజు, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జె.ఎన్.రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్క శ్యామ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం హిమాయత్ నగర్ లోని పరివర్తన లా ఛాంబర్స్ లో జరిగిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఎం.ఆర్.పి.ఎస్ ఉద్యమం అవాస్తవాలు పునాదితో కూడినదని అన్నారు. తెలంగాణలో మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార, ఆర్ధిక రంగాల్లో ముందు వరసలో ఉన్నారన్నారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ అన్నీ మాదిగ జాతే అనుభవించారని నిజానికి మాల ఉపకులాలు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని పూర్తి అన్యాయం జరిగిందన్నారు. డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతులన్నీ ఐక్యతతో ఉండాలన్న పిలుపు మేరకు ఎస్సి కులాలు విచ్చిన్నం కాకూడదని వర్గీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నామని తెలిపారు. దళిత జాతి రాజకీయ అధికారంలోకి రాకుండా పూర్తిగా బానిసలు గా ఉంచాలన్న మనువాద దోపిడీ కులాలు చేసిన కుట్రలు తోనే ఎస్సి వర్గీకరణ వాదం ను పుట్టించి పెంచి పోషించిరాని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకు ను రాబట్టుకోవడం కోసం బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ చేత వర్గీకరణ చేయిస్తామని ప్రక టించారని తెలిపారు. రాజ్యాంగం స్ఫూర్తి తెలియని మూర్కుడు నరేంద్ర మోడీ అయినందునే ఎస్సీల భవిష్యత్ రాజకీయ క్రీడలు బీజేపీ, ఆడుతున్నారన్నారు. ప్రధాని ప్రకటన అత్యంత సిగ్గుచేటని దళితుల విభజనకు పూనుకోవడం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడవటమే నవిమర్శలు చేసారు. ఈ లాంటి చర్యలుకు నిరసనగా మోడీ, కిషన్ రెడ్డి దిష్టి బొమ్మలను తగులబెట్టాలన్నారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చే తెలంగాణలోని కాంగ్రెస్, బిఆర్ఎస్, కమ్యూనిస్ట్ వంటి రాజకీయ పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉపకులాలను పెద్ద ఎత్తిన సమీకరించి లక్షలాది మందితే హైదరాబాద్ లో మాలల సత్తా చాటుతామని మాలమహానాడు నేతలు ప్రకటించారు.
వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే బీజేపీని సమాధి చేస్తాం





