వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మహేశ్వరం, ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎటువంటి వనరులు లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధి చెందుతున్నా అన్ని వనరులు, టెక్నాలజీ ఉన్నా భారత దేశం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నుంచి డోలి గుర్తు, ఎల్బీనగర్ నుంచి క్రేన్ గుర్తుతో బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన తాను ఎన్నో దేశాలు తిరిగానని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని దగ్గరగా గమనించానని అన్నారు. శక్తి వంతమైన వ్యవస్థ భారత్ లో ఉందని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై తాను లోతుగా పరిశోధించినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి మారుపెరుగా నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *