కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయమని నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల్లో చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని అన్నారు. బిఆర్ఎస్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గెలుపు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయం ముప్పు శ్రీనివాస్ రెడ్డి





