వజ్రేష్ యాదవ్ కు మద్దతుగా జూపల్లి శోభారాణి కృష్ణారావు విస్తృత ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  20 : తోటకూర వజ్రేష్ యాదవ్   గెలుపు  తధ్యమని  దమ్మాయిగూడ   మున్సిపల్  కాంగ్రెస్ పార్టీ  మహిళా అధ్యక్షురాలు  జూపల్లి శోభారాణి  కృష్ణారావు  అన్నారు.  సోమవారం ఆమె  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని దమ్మాయిగూడలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు.  చేతి  గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని     భారీ  మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రచారంలో ప్రజల నుంచి   విశేష  స్పందన లభిస్తుందని  తెలిపారు. ప్రజలు  కాంగ్రెస్  నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే బిఆర్ఎస్   నాయకులను  ప్రజలు నమ్మరని తెలిపారు.  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని  ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్   నాయకులు    తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *