వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం, లాంటి చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా కాంగ్రెసు సభల్లో వందేమాతరం గీతాన్ని తొలి సారి పాడారు.ఆనంద మఠం నవలని భారతదేశ చారిత్రక నవలలల్లో అత్యంత ప్రధానమైనదని భావిస్తారు. రామకృష్ణ పరమహంస సమకాలీనులు, ఆయన సన్నిహిత మిత్రులు అయిన బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ ఆనంద్‌మఠ్ రచించారు. వందేమాతరంను ఎన్నో ఏళ్ల ముందే ఆయన ఒక కవిత రూపంలో రాశారు. అయితే తర్వాత ప్రచురితమైన ఆనంద్‌మఠ్ నవలలో దానిని భాగం చేశారు. అది అలా దేశవ్యాప్తంగా జాతీయ వాదానికి ప్రతీకగా మారిపోయింది.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు.
వందేమాతరం జనాదరణ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది.బంకించంద్ర ఈ నవలని బెంగాలీలో రాయగా, తరువాత ఇతర భాషలలోనికి అనువదించ బడింది. ఈ నవలలో ఉపయోగించిన వందేమాతరం గీతాన్ని 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ టాగోర్ ఆలపించారట. తరువాత వందేమాతరం ఎంతో ప్రఖ్యాతి చెందింది. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయవాద నినాదంగా వాడబడింది. స్వాతంత్ర్యానంతరం భారత జాతీయగేయంగా ప్రభుత్వం వందేమాతరాన్ని స్వీకరించింది.కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్‌చెస్టర్ గార్డియన్ లాంటి విదేశీ పత్రికలు కూడా బెంగాల్ విభజనను నిరసిస్తూ వార్తలు ప్రచురించాయి.
అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జూలై 7న, ‘పరిపాలనా సౌలభ్యం’ పేరిట బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాడు. భారతీయులు వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్నే ‘వందేమాతరం ఉద్యమం’ అని వ్యవహరించారు. ఉద్యమం లో పాల్గొన్నవాళ్ళు సామూహికంగా బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని గానం చేసేవారు. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమితం కాకుండా దేశ వ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్ చంద్రపాల్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఈ ఉద్యమ కాలంలోనే ట్యుటికోరిన్ (మద్రాస్)లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీని స్థాపించారు. అక్కడ ఈ ఉద్యమాన్ని సుబ్రమణ్య అయ్యర్, చిదంబర పిళ్లె విస్తృతం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించారు. పంజాబ్‌లో భగత్‌సింగ్ మేనమామ అజిత్ సింగ్ అంజుమాన్ మెహబత్ వాటన్ అనే సంస్థను, భారతమాత అనే పత్రికను నడిపి ఉద్యమాన్ని విస్తరించారు.
ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను, బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో హిందువులు, ముస్లింలు ఐక్యతతో పాల్గొన్నారు. బహిష్కరణోద్యమం జరుగుతున్న సమయంలోనే నాయకులు నిర్మాణాత్మక ఆలోచనలతో స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. బంకిమ్ కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన ఒక ప్రభుత్వ అధికారి కూడా. ఎన్నో ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఆయన ఉన్నారు. 1881లో ప్రభుత్వ సేవల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ అధికారిగా పని చేశారు.1894 ఏప్రిల్లో బంకిమ్ చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన “వందేమాతరం” అనే పేరు పెట్టారు. లాలా లాజ్‌పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు.
స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయ గేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయగీతం హోదా కూడా దక్కలేదు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారత దేశం జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనకాడారు. స్వయంగా వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కలిసిన నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వాతంత్రోద్యమం మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయం కోరారు.బంకిమ్ చంద్ర కవితలను, ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు. వందేమాతరం లోని మొదటి రెండు శ్లోకాలను బహిరంగంగా పాడవచ్చని నెహ్రూకు ఆయన చెప్పారు.
రాజ్యాంగ బద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




