లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం

మాగుంట రాఘవరెడ్డి కస్టడీ 14రోజులు పొడిగింపు
న్యూదిల్లీ,మార్చి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ రెడ్డి  జ్యూడిషియల్‌ ‌కస్టడీని రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు మాగుంటను అధికారులు కోర్టులో హాజరుపరిచ్చారు. రాఘవరెడ్డి తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాస్‌ ‌రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.

కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని మాగుంట రాఘవ జ్యుడిషియల్‌ ‌కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. ప్రస్తుతం మాగుంట తీహార్‌ ‌జైలులో ఉన్నారు. మార్చి 13న మాగుంట రాఘవ బెయిల్‌ ‌పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ ‌చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియాను కూడా అరెస్ట్ ‌చేసి ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *