లక్ష మెజారిటీతో గెలవాలంటు విరాళం అందజేసిన మహిళలు

 ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ అక్టోబర్ 19 : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదన్నను లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు,ఈ సందర్భంగా చేవెళ్ల గ్రామానికి చెందిన దండు మల్లమ్మ అలాగే పెంటయ్య లు చేవెళ్ల శాసనసభ సభ్యులు కాలే యాదయ్య కి ఎన్నికల ఖర్చు కోసం ఆర్థిక సాయంగా 51,116 రూపాయలు విరాళంగా గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు అందజేశారు.పిలిస్తే పలికే నాయకుడని గర్వం కోపం లేని నాయకుడని అందరితో కలిసిపోయే మనసున్న మా యాదన్న అని చేవెళ్ల ప్రజలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అభిమానులు,కార్యకర్తలు,చేవెళ్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *