బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
పాండవులు బయలు దేరి సమయంలో విదురుడు పాండవులతో మర్మగర్భంగా ఇలా అన్నాడు. పాండునందనులారా! శత్రువు యొక్క వ్యవహారం తెలుసుకున్నవాడు రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగి తమను తాము రక్షించుకోవాలి. అడవి మండుతూవున్నా, ఎలుక కలుగలో దూరి తనను తాను రక్షించు కుంటుంది. సరైన దారి చూసుకుని ఎలుక బయటపడుతుంది. నక్షత్రాలు దిక్కులు తెలిపేందుకు వున్నాయి. సంచేంద్రియాలను అదుపులో వుంచుకున్నావాడు శత్రువుల నుండి రక్షించబడతాడు. అన్న మాటలను ధర్మరాజు శ్రద్ధగా ఆలకించి సరేనన్నాడు. పాండవులు ప్రయాణం సాగిస్తూవున్న సమయంలో కుంతీదేవికి విదురుడు చెప్పినదాంట్లో మర్మాన్ని తెల్సుకోవాలనుకుని ధర్మరాజుని అడిగింది.

‘అమ్మా మనం వుండబోయే ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుందనీ, రక్షణకు ఖి)మార్గాన్ని నిర్మించుకోమనీ, సోదరులంతా ఏకభిప్రాయంతో ఉండాలనీ, అలా వుంటే ఏ ప్రమాదమూ రాదని ఆ ధీశాలి చెప్పారు.’ అన్నాడు ధర్మరాజు. వారాణావతం చేరగానే పాండువులకు ప్రలంతా ఎదురువెళ్ళి అపూర్వంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని చిరునవుతో పాండవులు స్వీకరించారు. పండితులూ, విద్వాంసులూ అయిన పురప్రముఖులను పలకరించారు. వీరులందరినీ గౌరవపూర్వకంగా చూసి, ప్రజలతో ప్రియభాషణం గావించి, ఆ తర్వాత పురోచనుని సలహామేరకు ‘శివభవనం’లో అడుగుపెట్టారు.

భవనంలోకి అడుగుపెట్టగానే ధర్మరాజు్ల ంతానేతి వాసనవుండటం గమనించాడు. భీమసేనుడితో ఇంటిని నేతితో నిర్మించి నిప్పుపెట్టడానికి నిర్ణయించారన్న విషయం చెప్పాడు. అందువలన పరిసరాలను జాగ్రత్తగా గమనించి రహస్యంగా సొరంగం తవ్వుకోవాలని చెప్పాడు. భీముడు వెంటనే భవనం వదిలి వెళ్ళిపోవాలనే సలహాఇచ్చాడు. ధర్మరాజు అది ధీ•మంతుల లక్షణం కాదన్నాడు. అప్రమత్తమై రక్షణ మార్గం ఏర్పర్చుకోవాలన్నాడు. కొంత కాలం గడిచింది. ఒకరోజు ఏకాంతంగా ఒక వ్యక్తి ధర్మరాజును సమీపించి అయ్యా నేను సొరంగాలు తవ్వుతాను. విదురులవారు నన్ను పంపారు. అనిచెప్పగానే ధర్మరాజు అతనిని తన కొలువులో నియమించుకున్నాడు.
(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *