తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 21: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ టు గెలుపొందడం ఖాయమని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్లో టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ రావడంపై గాంధీనగర్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోవర్గ టికెట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని అన్నారు, భవిష్యత్తులో రోహిత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చంటి యాదవ్, గాంధీనగర్ కాలనీవాసులు సాగర్, ప్రశాంత్, నగేష్, సాయి, శ్రీను,భాను, చింటూ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.



