- ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
- సోషల్ డియాలో వీడియో పోస్టుతో గుర్తించిన పోలీసులు
లక్నో, జూలై 19 : రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిపై కారుడ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అలాగే ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ సంఘటనను రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ డియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఒక వ్యక్తి రోడ్డు శివారులో కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఒక కారు వేగంగా అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఆ వ్యక్తిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో కారులో వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై వెళ్లే వాహనాలను వీడియో తీయసాగాడు.
అనుకోకుండా ఈ సంఘటన అతడి కెమెరాలో రికార్డ్ అయ్యింది. రోడ్డుపై ఉన్న వ్యక్తిని ఢీకొన్న కారు వెనుక అద్దంపై బీజేపీ జెండా స్టిక్కర్ ఉన్నది. అలాగే ’ఎమ్మెల్యే ప్రతినిధి’ అని కూడా దానిపై రాసి ఉంది. ఈ వీడియో క్లిప్ సోషల్ డియాలో వైరల్ అయ్యింది. మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై పోలీసులు స్పందించారు. నంబర్ ప్లేట్ ద్వారా వ్యక్తిని ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను సౌరభ్ శర్మగా గుర్తించారు. కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. కారు దూసుకెళ్లడంతో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.



