జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన జగదేవపూర్ శివారులో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలానికి చెందిన మిట్టపల్లి అఖిల్ తండ్రి వెంకటేశం (15 ) వయసు విద్యార్థి రోజు మాదిరిగానే అలిరాజపేట్ సెయింట్ విన్సెంట్ హై స్కూల్ కు తండ్రి మిట్టపల్లి వెంకటేశం బైకు టీఎస్.36.8895 గ్లామర్ బైక్ పై జగదేవపూర్ నుండి అలీరాజ్ పేట్ వైపు వెళుతుండగా శివ బ్రిడ్జి మూలమలుపు రాగానే తనకు ఎదురుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుండి జగదేవపూర్ వైపు వస్తున్న లారీ 52 Q 1815 దానిని అందాజా ఉదయo 8.0 గంటలకు లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ రైట్ వైపునకు వచ్చి బైకును బలంగా ఢీకొట్టడంతో విద్యార్థి అఖిల్ రోడ్డుపై పడగా తలకు వెనుక భాగంలో మరియు ఎడమ కాలు విరిగి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గా తెలిపారు. అదేవిధంగా లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని అన్నారు.



