రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : ఆమనగల్లు – షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆమనగల్లు ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం కర్కస్ తండా కు చెందిన కేతావత్ గోపాల్ (43) అతని చెల్లెలు కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి తన ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తి కృష్ణతో కలిసి బయలుదేరాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు షాద్నగర్ మూలమలుపు వద్ద పాత షెడ్డు కు ద్విచక్ర వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడు ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందనీ అన్నారు. అతని భార్య చిట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *