రైతు సంక్షేమం.. వ్యవసాయ అభివృద్ధి… దేశానికి ఆదర్శంగా తెలంగాణ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది.’’

రైతుబందు కింద 9 విడతల్లో 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.57,956 కోట్లు జమచేసిన ప్రభుత్వంధాన్యపు రాసులతో కళ కళ లాడుతున్న రైతుల లోగిళ్ళుతెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది.  నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగపై ఆధారపడి  బతికే  రైతుకు ఆర్థిక వెసులుబాటుకై, పంట అభివృద్ధికి పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది.  అనేక నూతన వ్యవసాయ పద్థతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి  తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఉద్యమ సమయంలో ఊరు, వాడ, పల్లె, పట్నం జిల్లాలో విస్తృతంగా తిరిగిన మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు రైతుల సమస్యలు స్వయంగా చూశారు. రైతుల బాధలు  ఆకళింపు చేసుకున్నారు.2014 జూన్‌ ‌లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ సారధిగా అభివృద్ధి సంక్షేమం పై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి దశల వారిగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుటకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రైతులు, వ్యవసాయరంగం సమస్యలపై దృష్టిసారించారు. దేశానికే వెన్నెముక్క అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహన్ని రూపొందించారు.. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తలపెట్టారు.

మొదటి ప్రభుత్వ హయాంలోనే  రైతులను ఆర్థికంగా ఆదుకొనుటకు  41.46 లక్షల మంది రైతులకు చెందిన 22 వేల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. గతంలోని నీటి పన్ను బకాయిలను రద్దు చేయటమే కాకుండా, సాగునీటి పన్నును శాశ్వతంగా రద్దు చేసిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. దీనికి గాను సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం 36 వేల 179 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వినూత్న వరవడితో రైతుబందు పతకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయం చేస్తుంది. రైతులకు సాలీన  ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందచేస్తున్నది. రైతుబందు కింద 9 సీజన్లలో 65 లక్షల మంది రైతులకు రూ.57,956  కోట్లను ప్రభుత్వం అందజేసింది. దురదృష్టవశాత్తు ఏ రైత్కెనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతు భీమా పథకం ప్రవేశపెట్టింది. 100 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది.ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు భీమా వర్తింపజేస్తున్నది .రైతు మరణించిన పది రోజులలోపే ఆ కుటుంబాలకు ఎల్‌.ఐ.‌సి ద్వారా 5 లక్షల రూపాయలను రైతు భీమా గా ఇస్తున్నది.  ఇప్పటివరకు 83 వేల 816 కుటుంబాలను  రూ.4,161 కోట్లను రైతు బీమాగా ఇచ్చి అండగా నిలిచింది.

నేడు రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేయబడుతున్నది.  2 కోట్ల పద్దెనిమిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత ఎనిమిది సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తి ఎనిమిది రెట్లు పెరిగింది. నేడు వరి ఉత్పత్తిలో పంజాబ్‌ ‌రాష్ట్రంలో తెలంగాణ పోటీపడుతున్నది.  దేశంలోనే అత్యధికంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండించిన మొత్తం వరి ధాన్యానికి మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌స్థానానికి చేరుకున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఆన్‌ల్కెన్‌లో విత్తనాల ధృవీకరణ చేస్తుంది. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. కల్తీ వ్యాపారులపై పి.డి. యాక్టు ప్రయోగిస్తున్నది. రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుండి 31.9 లక్షల టన్నులకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఐదు వేల ఎకరాల భూమిని ఒక క్లస్టర్‌ ‌గా విభజిస్తూ మొత్తం 2601  క్లస్టర్లలో రూ. 572 కోట్ల 88 లక్షల వ్యయంతో రైతు వేదికలను నిర్మించింది. ఆధునిక సేద్య పద్ధతులను క్షేత్ర స్థాయిలోకి తెచ్చి రైతులకు చేరువ చేయుటకు వ్యవసాయ విస్తరణ అధికారులకి 17 రకాల విధులను అప్పగించింది. వాణిజ్య పంటలు, కూరగాయలు వైపు రైతులను మళ్ళించుటకు వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నది. వ్యవసాయంలో అధిక దిగుబడి పొందేందుకు గాను రైతులకు సలహాలు సూచనలు చేయటానికి విస్తరణాధికారులను నియమించింది.

నూతన వ్యవసాయ పద్ధతులతో పాటు రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం నేడొక లాభదాయక రంగంగా మారింది. నాణ్యమైన ఉచిత విద్యుత్త్, ‌సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగం పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నది. రైతులు అధిక దిగుబడి పొంది ఆర్థికంగా ఎదుగుటకు దోహదం చేస్తుంది. నేడు దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ మారుటకు రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. తెలంగాణ రైతులు దేశంలోనే ధనిక రైతులుగా అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో నేడు రైతుల లోగిళ్లు ధాన్యపురాసులతో కళ కళ లాడుతున్నాయి.

– కమిషనర్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారిచేయానైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *