రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

వడగండ్ల వానలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రత్నారెడ్డి.
వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని రైతులను మోసానికి గురిచేస్తూ పాలన సాగిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు జగ్గరి రత్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి నుంచి పంటలు అమ్ముకునే వరకు ఆదుకోవడం జరుగుతుందని కల్లబొల్లి మాటలు చెబుతూ రైతులను మోసానికి గురి చేస్తున్నారన్నారు. కేవలం రైతుబంధు ఇచ్చి వ్యవసాయ పరికరాలపై మందులు ఎరువులపై సబ్సిడీలు ఎత్తివేసి రైతులను తీరని మోసానికి గురి చేశారన్నారు. రైతులకు పంట పెట్టుబడి ఇచ్చినట్లు ఇచ్చి వారం రోజుల్లో రైతుల నుంచి ప్రభుత్వం డబ్బులు దోచేసుకుంటుందన్నారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఆరు నెలల క్రితం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మోమిన్పేట్ మండలాల్లో వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పంటలను పరిశీలించేందుకు హెలికాప్టర్లలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మంత్రి సబితా రెడ్డి ఎమ్మెల్యేలు ఉటావుటిన వెళ్లి పరిశీలించారు కానీ ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని కల్లబొల్లి మాటలతో టిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. వెంటనే మర్పల్లి మోమిన్ పేట్ మండలాల్లో పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహార డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతు రుణమాఫీ చేశామని చెప్పారు కానీ ఇప్పటికీ ఏ రైతు ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఆయన పేర్కొన్నారు. సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. రైతులు యువకులు పేద బడుగు బలహీనవర్గాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయిందని కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఏర్పడిందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రత్నారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *